Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కామారెడ్డి జిల్లా పదేళ్ల ప్రస్థానం.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కేసీఆర్ కృషి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

Author
Posted By TELANGANA EXPRESS
| 11 Oct 2026, 07:34 PM | EDITORIAL, TELANGANA
కామారెడ్డి జిల్లా పదేళ్ల ప్రస్థానం.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కేసీఆర్  కృషి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి ప్రతినిధి తెలంగాణ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 11
భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా ఏర్పాటు జరిగి పది సంవత్సరాలు అయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి వద్ద దశాబ్ది ఉత్సవాల సభను ఏర్పాటు చేయడం జరిగింది. *ఈ సభను ఉద్దేశించి కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు మాట్లాడడం జరిగింది
14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షే తన లక్ష్యంగా ముందుకు సాగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన అనంతరం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఆయన ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది.

ఆ చారిత్రాత్మక నిర్ణయంలో భాగంగా కామారెడ్డికి జిల్లా కేంద్రం హోదా లభించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘కామారెడ్డి జిల్లా పదేళ్ల పండుగ’ కార్యక్రమాన్ని నేడు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా పదేళ్ల ప్రస్థానం.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కేసీఆర్  కృషి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ - Additional Image

కామారెడ్డి మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంలో కేసీఆర్ గారు చూపిన దూరదృష్టిని, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాలను స్మరించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఒక ప్రాంతం జిల్లా కేంద్రంగా అవతరించడం అంటే కేవలం పరిపాలనా హోదా పొందడం మాత్రమే కాదు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు చేరువ కావడం, పరిపాలనా సేవలు అందుబాటులోకి రావడం, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడటం, స్థానిక ప్రజల ఆకాంక్షలకు గుర్తింపు లభించడం కూడా. కామారెడ్డి జిల్లా ఏర్పాటు ఈ ప్రాంత చరిత్రలో అలాంటి ఒక కీలక మైలురాయిగా నిలిచింది.

కామారెడ్డి జిల్లా పదేళ్ల ప్రస్థానం.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కేసీఆర్  కృషి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ - Additional Image

ఈ సందర్భంగా గంప గోవర్ధన్ గారు మాట్లాడుతూ, “కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసిన కేసీఆర్ గారి కృషి చిరస్మరణీయం. జిల్లా ఏర్పాటు వెనుక ఆయనకున్న దూరదృష్టి, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే సంకల్పం ఎంతో గొప్పవి. కామారెడ్డి జిల్లా ఉన్నంతకాలం జిల్లా చరిత్రలో కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్ కామారెడ్డి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ కుమార్ మాచారెడ్డి మాజీ జెడ్పిటిసి మిల్కూరి రామ్ రెడ్డి కామారెడ్డి పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి కామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బలరాజ్ పాల్వంచ మండల అధ్యక్షుడు రాజా గౌడ్ మాచారెడ్డి మండల అధ్యక్షుడు బాలచంద్రం దోమకొండ మండల ప్రధాన కార్యదర్శి బొమ్మెర శ్రీనివాస్ రాజంపేట మండల అధ్యక్షులు బలవంతరావు బిక్నూర్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కామారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్ బిఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షులు చెలిమెల భాను ప్రసాద్ కౌన్సిలర్లు మామిళ్ల లక్ష్మణ్ ఎజాస్ గరిగంటి స్వప్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పోలీస్ కృష్ణాజి రావు జెర్సీ నర్సింలు మన్సూర్ తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి జిల్లా పదేళ్ల ప్రస్థానం.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కేసీఆర్  కృషి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ - Additional Imageకామారెడ్డి జిల్లా పదేళ్ల ప్రస్థానం.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కేసీఆర్  కృషి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ - Additional Image
అత్యధికంగా చదివినవి
బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!.  .        జిల్లాలో  త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు..  .      చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!. . జిల్లాలో త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు.. . చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం