కామారెడ్డి జిల్లా పదేళ్ల ప్రస్థానం.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కేసీఆర్ కృషి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి ప్రతినిధి తెలంగాణ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 11 భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా ఏర్పాటు జరిగి పది సంవత్సరాలు అయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి వద్ద దశాబ్ది ఉత్సవాల సభను ఏర్పాటు చేయడం జరిగింది. *ఈ సభను ఉద్దేశించి కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు మాట్లాడడం జరిగింది 14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షే తన లక్ష్యంగా ముందుకు సాగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు...