Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు ప్రాధాన్యం ఇవ్వాలి డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు

Author
Posted By TELANGANA EXPRESS
| 11 Oct 2026, 05:33 PM | EDITORIAL, TELANGANA
నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు ప్రాధాన్యం ఇవ్వాలి  డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు

ఎల్లారెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి అక్టోబర్ 11

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం ఎల్లారెడ్డి ముదిరాజ్ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దుద్దుల సాయిరాం అధ్యక్షతన ముదిరాజ్ సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ ముదిరాజ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ముదిరాజులు అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ముదిరాజులకు నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అదిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో రాజకీయ పార్టీలు అలసత్వం వహిస్తున్నాయని రాజకీయ పార్టీలకు తమ ధోరణి మార్చు కోవాలని లేని పరిస్థితిలో ముదిరాజులు రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారాని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు గుర్తించి సొసైటీ చైర్మన్ లు కానీ మండల అధ్యక్షులు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ముదిరాజులను నియమించాలని ఆయా పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ముదిరాజులకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. అధికార పార్టీ నాయకులు చొరవ చూపించి నామినేట్ పదవుల్లో ముదిరాజులకు అవకాశం కల్పించాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మేమేంటో సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కామారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో మండల స్థాయి నామినేటెడ్ పోస్టులు కానీ జిల్లాస్థాయి పోస్టులు కానీ ఇవ్వటం లేదని ఆయా రాజకీయ పార్టీలు ముదిరాజులను అనగాదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ముదిరాజ్ లపై రాజకీయ కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ముదిరాజులపై కుట్ర చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింహులు, జక్కుల సంతోష్ కుమార్, మర్రి బాలకిషన్, మర్రి ప్రకాష్,గంట సాయిలు,భాస్కర్, ప్రవీణ్,క్యాస కిష్టయ్య,కన్నెబొయిన రాజు,గొనె మహేందర్, జక్కుల అశోక్, పరంధాములు, సాయిలు,నిల రవి తదితరులు పాల్గొన్నారు...

నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు ప్రాధాన్యం ఇవ్వాలి  డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు - Additional Image
అత్యధికంగా చదివినవి
బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!.  .        జిల్లాలో  త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు..  .      చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం