Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సన్ ఫైర్ క్రాకర్స్ దీపావళి బాంబుల మాటున దాగిన ట్రాఫిక్ కష్టాలు

Author
Posted By TELANGANA EXPRESS
| 06 Nov 2026, 07:57 AM | Bhakti, TELANGANA
సన్ ఫైర్ క్రాకర్స్ దీపావళి బాంబుల మాటున దాగిన ట్రాఫిక్ కష్టాలు

  • రోడ్డుకు అడ్డంగా భారీ
  • హనుమాన్ కటౌట్ డీజే సౌండ్ల హోరు
  • భారీ లైటింగ్‌తో వాహనదారులకు ఇక్కట్లు
  • ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉన్నాయా
  • కటౌట్, డీజే ఏర్పాట్లకు అధికారుల
  • అనుమతి తీసుకున్నారా
  • సంబంధిత శాఖలు స్పందించాలి


హైదరాబాద్, నవంబర్ 5


దీపావళి పండుగ సంబరాల మాటున సామాన్య ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదా వ్యాపార ప్రచారం కోసం ఏర్పాటు చేస్తున్న భారీ కటౌట్లు, డీజే సౌండ్ సిస్టమ్స్, ఆకర్షణీయమైన లైటింగ్ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో, నాగోల్ చౌరస్తా నుంచి కొత్తపేట వైపు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న సన్ ఫైర్ క్రాకర్స్ వద్ద దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ హనుమాన్ కటౌట్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారాయి
ఇప్పటికే నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ మార్గంలో భారీ కటౌట్ రహదారికి ఆటంకంగా మారుతోందా వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరోవైపు భారీ డీజే సౌండ్లు, కళ్లను మిరుమిట్లు గొలిపే లైటింగ్ వల్ల ప్రయాణికుల దృష్టి మరలే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, కార్లలో ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది

ఇవి కూడా చదవండి

బాణసంచా విక్రయ కేంద్రం కావడంతో ఇక్కడ భద్రతా ప్రమాణాలపై కూడా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి సన్ ఫైర్ క్రాకర్స్‌కు బాణసంచా విక్రయాల కోసం చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉందా అవసరమైన అగ్నిమాపక భద్రతా అనుమతులు పొందారా అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణమే స్పందించేందుకు ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉన్నాయా బాణసంచా నిల్వ విక్రయాలకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను ఫైర్ సర్వీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది
అదేవిధంగా భారీ హనుమాన్ కటౌట్ ఏర్పాటుకు సంబంధిత శాఖల అనుమతులు తీసుకున్నారా ప్రజా రహదారికి ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారా
డీజే సౌండ్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు నిర్దేశిత సమయ పరిమితులు పాటిస్తున్నారా భారీ లైటింగ్ వల్ల రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నలకు యాజమాన్యం అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది

ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ వైపు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు ఇలాంటి కీలకమైన రహదారిపై ఎలాంటి అవరోధాలు లేకుండా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టడం అత్యంత ముఖ్యం. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు రహదారులపై క్రమబద్ధమైన రాకపోకల కోసం శ్రమిస్తుంటే మరోవైపు వ్యాపార ప్రచార ఏర్పాట్ల కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్ శాఖ రహదారిపై ఉన్న ఏర్పాట్లను పరిశీలించి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే అంశాలపై చర్యలు తీసుకోవాలి. ఫైర్ సర్వీస్ అధికారులు బాణసంచా విక్రయ కేంద్రం లైసెన్స్, నిల్వ విధానం, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేయాలి. జీహెచ్ఎంసీ అధికారులు కటౌట్ ఫ్లెక్సీలు తాత్కాలిక నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను పరిశీలించాలి పోలీస్ శాఖ డీజే నిర్వహణ శబ్ద కాలుష్య నిబంధనల అమలుపై దృష్టి సారించాలి
వ్యాపారం చేసుకోవడం ప్రతి ఒక్కరి హక్కే కానీ ప్రజల భద్రతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు దీపావళి పండుగ పేరుతో రహదారులకు ఆటంకం కలిగించే ఏర్పాట్లు చేసినా అగ్నిమాపక భద్రతా నిబంధనలు ఉల్లంఘించినా అవసరమైన అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించినా సంబంధిత అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
సన్ ఫైర్ క్రాకర్స్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. అనుమతులు, భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ ఇబ్బందులపై సమగ్రంగా పరిశీలించి, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు

అత్యధికంగా చదివినవి
బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!.  .        జిల్లాలో  త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు..  .      చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!. . జిల్లాలో త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు.. . చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం