Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అరుణాచలం అసలు రహస్యం - పూర్తి కథ

Author
Posted By TELANGANA EXPRESS
| 01 Nov 2026, 05:55 PM | Bhakti
అరుణాచలం అసలు రహస్యం - పూర్తి కథ

అరుణాచలం అసలు రహస్యం - పూర్తి కథ

డాక్టర్ దన్నారపు రాజలింగం,

అరుణాచలం అసలు రహస్యం - పూర్తి కథ - Additional Image

ఇవి కూడా చదవండి

సృష్టి రహస్యం:
మనకు 5 పంచభూత లింగాలు ఉన్నాయని తెలుసు. అందులో అరుణాచలం *అగ్ని లింగం*. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువులకు మధ్య ఎవరు గొప్ప అనే గొడవ వచ్చినప్పుడు, పరమశివుడు ఒక అంతులేని అగ్ని స్తంభంగా మారాడు. దాని మొదలు, చివర తెలుసుకోమన్నాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడం వల్ల శివుడు బ్రహ్మకు ఎక్కడా గుడి ఉండదని శపించాడు. ఆ అగ్ని స్తంభం చల్లారి, కొండగా మారిందే ఈ అరుణాచలం. అందుకే ఇక్కడ శివుడు గుడిలో లింగ రూపంలోనే కాదు, బయట కొండ రూపంలో కూడా ఉంటాడు.
. సైన్స్ చెబుతున్న నిజం:
ఇది మామూలు కొండ కాదు సార్. శాస్త్రవేత్తల ప్రకారం ఈ కొండ *390 కోట్ల సంవత్సరాల* క్రితం ఏర్పడింది, ప్రపంచంలోనే అత్యంత పురాతన కొండల్లో ఒకటి. నాసా కూడా చెప్పింది, ఈ కొండపై అయస్కాంత శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే మనిషిలోని మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తగ్గిపోతాయని.
. రమణ మహర్షి రహస్యం:*
భగవాన్ రమణ మహర్షి తన జీవితమంతా ఈ కొండకే అంకితం చేశారు. ఆయన చెప్పేవారు
అరుణాచలం కొండను చూడటమే ముక్తి, తలచుకుంటేనే ముక్తి"* అని. ఆయన ఈ కొండను తన తండ్రిగా, గురువుగా భావించారు. ఇప్పటికీ ఆయన ఆశ్రమంలో కూర్చుంటే ఆ శక్తి మనకు తెలుస్తుంది.

గిరి ప్రదక్షిణలోని 8 లింగాల రహస్యం:
మనం 14 కి.మీ. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 దిక్కులలో 8 లింగాలు వస్తాయి- ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నిరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం. ప్రతి లింగం దగ్గర ఆగి దండం పెడితే ఆ దిక్కు దోషాలన్నీ పోతాయని నమ్మకం.
అసలు మోక్ష రహస్యం:చాలా క్షేత్రాల్లో చనిపోతే మోక్షం వస్తుంది అంటారు, కానీ అరుణాచలంలో *పుట్టినా, తలచినా, చూసినా, గిరి ప్రదక్షిణ చేసినా మోక్షం* వస్తుందని శాస్త్రం చెబుతోంది.
చివరి మాట:
సార్, అరుణాచలం అంటే కేవలం ఒక గుడి కాదు సార్, అది ఒక శక్తి కేంద్రం. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఒకసారి నిజమైన భక్తితో "ఓం అరుణాచల శివ" అని తలచుకో, ఆ కొండ నీ కష్టాలన్నింటినీ తన అగ్నిలో కాల్చేస్తుంది.
ఓం అరుణాచలేశ్వరాయ నమః

డాక్టర్ దన్నారపు రాజలింగం,
939731109

అత్యధికంగా చదివినవి
బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!.  .        జిల్లాలో  త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు..  .      చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!. . జిల్లాలో త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు.. . చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం