Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ ప్రజాసేవే లక్ష్యం.. ప్రజల ఆశీర్వాదమే నా బలం – నారపాక అశోక్

Author
Posted By TELANGANA EXPRESS
| 11 Oct 2026, 03:17 PM | EDITORIAL, TELANGANA
సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ  ప్రజాసేవే లక్ష్యం.. ప్రజల ఆశీర్వాదమే నా బలం – నారపాక అశోక్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ బీర్‌పూర్: జగిత్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 11
బీర్‌పూర్ మండలంలోని మంగేళ గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ తన స్వంత ఖర్చులతో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆదివారం మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనకు జిల్లా స్థాయి పార్టీ బాధ్యతలు లభించిన సందర్భంగా, తన ఎదుగుదలకు సహకరించిన గ్రామ ప్రజలతో పండుగ సంతోషాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా నారపాక అశోక్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని అన్నారు. అలాంటి పండుగ సందర్భంగా తన అక్కాచెల్లెళ్లకు చీరలు అందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఇది కేవలం చీరల పంపిణీ మాత్రమే కాదని, తనను ఆదరించి, ఆశీర్వదించి, ఈ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించిన ప్రజలతో ఆత్మీయతను పంచుకునే కార్యక్రమమని పేర్కొన్నారు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ  ప్రజాసేవే లక్ష్యం.. ప్రజల ఆశీర్వాదమే నా బలం – నారపాక అశోక్ - Additional Image

విద్యార్థి దశ నుంచి జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగే వరకు ప్రజల ప్రోత్సాహమే ప్రధాన బలం

విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రజల మధ్య ఉంటూ తాను రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానని అశోక్ తెలిపారు. గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో ప్రజలు చూపిన ఆదరాభిమానాలు, కార్యకర్తలు అందించిన సహకారం, పెద్దల ఆశీర్వాదాలు తన ఎదుగుదలకు పునాదిగా నిలిచాయని అన్నారు. ప్రస్తుతం బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం తనకు గౌరవంతో పాటు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ  ప్రజాసేవే లక్ష్యం.. ప్రజల ఆశీర్వాదమే నా బలం – నారపాక అశోక్ - Additional Image

పదవులు అనేవి హోదా కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడానికి లభించే అవకాశాలని, పార్టీ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్సీ సమాజంలోని పేదలు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా అవగాహన కల్పించడంతో పాటు, ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజల మధ్యే ఉంటా.. ప్రజాసేవలోనే ముందుంటా

సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ  ప్రజాసేవే లక్ష్యం.. ప్రజల ఆశీర్వాదమే నా బలం – నారపాక అశోక్ - Additional Image

తన భవిష్యత్ రాజకీయ ప్రయాణంలో ప్రజల ఆశీర్వాదాలు, కార్యకర్తల సహకారం, పెద్దల మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉండాలని నారపాక అశోక్ ఆకాంక్షించారు. ప్రజల మద్దతుతో మరింత ఉన్నత స్థాయికి ఎదిగినా, తన మూలాలను, తన గ్రామాన్ని, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలను ఎప్పటికీ మరచిపోనని చెప్పారు. భవిష్యత్తులో పార్టీ పరంగా మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టడంతో పాటు, ప్రజల విశ్వాసాన్ని సంపాదించి ప్రజల చేత ఎన్నికయ్యే పదవుల్లోనూ సేవ చేసే స్థాయికి ఎదగాలన్నది తన ఆకాంక్ష అని తెలిపారు.

తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి కుటుంబంలో ఒకరిగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాసేవకు వినియోగిస్తూ, పేదలకు అండగా నిలవడం, అవసరమైన వారికి చేతనైన సహాయం అందించడం తన జీవితంలో నిరంతర భాగంగా కొనసాగిస్తానని పేర్కొన్నారు.

రాజకీయాల్లో తనకు లభించే ప్రతి అవకాశాన్ని ప్రజల సంక్షేమానికి, సమాజ అభివృద్ధికి వినియోగించుకోవడమే తన ప్రధాన లక్ష్యమని అశోక్ స్పష్టం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు.

“ప్రజలు ఇచ్చిన ఆదరణే నా ఎదుగుదలకు పునాది.. ప్రజల ఆశీర్వాదమే నా బలం.. ప్రజాసేవే నా జీవిత లక్ష్యం” అని నారపాక అశోక్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నారపాక దివ్య అశోక్, అద్వైత నారపాక, నారపాక లక్ష్మణ్, మోతె రాజేష్, దాసరి వెంకటేష్, నారపాక హరీష్, మోతె వంశీ, దాసరి వినోద్, దాసరి విష్ణు, మహిళలు, సోదరీమణులు, ప్రజలు పాల్గోన్నారు

అత్యధికంగా చదివినవి
బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!.  .        జిల్లాలో  త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు..  .      చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం