తిరుపతిలోని చింతలచేను రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అసమర్థ నాయకుల వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయని, తాగునీటి సమస్యను కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
చింతలచేను రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో తిరుపతి నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి టౌన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. రైల్వే డివిజనల్ ఇంజనీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు లేఖ రాశారు. 107 రైల్వే అండర్ బ్రిడ్జి మూడు నెలల ముందే పూర్తయింది. అయినప్పటికీ, పూర్తయిన రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. 2023లో రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది.
తిరుపతి అసమర్థ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. తిరుపతిలో తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. తాగునీటి సమస్యపై తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తాం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలెక్షన్లు చేస్తున్నారు. రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలని టీడీపీ నేతలు అడుగుతున్నారు.
చింతలచేను రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అని ఆయన హెచ్చరించారు.








