స్మార్ట్‌ఫోన్ రంగంలో అత్యాధునిక పనితీరు, కృత్రిమ మేధ సామర్థ్యాలను అందించేందుకు క్వాల్కామ్ రెండు కొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లను ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 పేర్లతో వీటిని న ఆవిష్కరించింది.
ఈ రెండు చిప్సెట్లు 2 నానోమీటర్ తయారీ సాంకేతికతపై రూపొందించబడ్డాయి. క్వాల్కామ్ స్వయంగా అభివృద్ధి చేసిన ఓరియన్ సీపీయూ, అడ్రినో జీపీయూ, హెక్సాగాన్ ఎన్పీయూ ఇందులో కీలకంగా పనిచేస్తాయి. ఫోన్లోనే కృత్రిమ మేధ ఆధారిత పనులను వేగంగా నిర్వహించడమే వీటి ప్రధాన లక్ష్యంగా కంపెనీ తెలిపింది.
ఎక్స్ట్రీమ్ జెన్ 6లో మరింత శక్తివంతమైన పనితీరు
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6ను క్వాల్కామ్ తన అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్లాట్‌ఫామ్‌గా పేర్కొంది. ఇందులోని ఓరియన్ సీపీయూలో రెండు ప్రైమ్ కోర్లు 5 గిగాహెర్ట్జ్ వరకు పనిచేస్తాయి. అడ్రినో జీపీయూలో కొత్త న్యూరల్ ఫ్యూజన్ సాంకేతికతను ఉపయోగించి గేమింగ్‌లో కృత్రిమ మేధ ఆధారిత గ్రాఫిక్స్‌ను అందించనుంది.
కెమెరా, వీడియోలో ఏఐ ఫీచర్లు
కొత్త చిప్సెట్లలో కెమెరా సామర్థ్యాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్స్ట్రీమ్ జెన్ 6లో అధునాతన ప్రొఫెషనల్ వీడియో సాంకేతికత, ఇంటెలిజెంట్ పిక్సెల్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఫొటోలు, వీడియోల్లో దృశ్యాలను మెరుగ్గా అర్థం చేసుకుని చిత్ర నాణ్యతను పెంచేందుకు ఉపయోగపడతాయని క్వాల్కామ్ తెలిపింది.
5జీ, వై-ఫైలోనూ వేగం
రెండు చిప్సెట్లలో క్వాల్కామ్ ఎక్స్105 5జీ మోడెమ్-ఆర్ఎఫ్ వ్యవస్థను అందించారు. గరిష్ఠంగా 14.8 జీబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్‌కనెక్ట్ 8800 వ్యవస్థ ద్వారా వై-ఫైలో గరిష్ఠంగా 11.6 జీబీపీఎస్ వేగాన్ని అందించే సామర్థ్యం ఉంది.
వినియోగదారుల అవసరాలను ముందుగానే అర్థం చేసుకుని కొన్ని పనులను స్వయంచాలకంగా నిర్వహించే ఏఐ ఆధారిత ఫీచర్లకు ఈ చిప్సెట్లు మద్దతు ఇస్తాయని క్వాల్కామ్ చెబుతోంది. రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. , , , , , , , , వంటి బ్రాండ్లు వీటిని ఉపయోగించే ఫోన్లను తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.








