Home తాజా వార్తలు వ్యాపారం ముసుగులో జీరో దందా

వ్యాపారం ముసుగులో జీరో దందా

by Telangana Express

ఏండ్లుగా సాగుతున్న సిండికేట్ దందా?

మామూళ్ల మత్తులో అధికారులు…

క్వాలిటీ లేని ఆహారపార్థాలతో అనారోగ్యాల పాలవుతున్న వినియోగదారులు…

వీణవంక, ఫిబ్రవరి 12( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కిరాణా షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడి, వినియోగదారులను మోసం చేస్తున్నారు. నిత్యవసర వస్తువులైన బియ్యం,నూనె, పాలు, పెరుగు, సబ్బులు,సర్ఫులు షాంపూల ను కల్తీ చేసి, వ్యాపారాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాల వల్ల వాంతులు,విరోచనాలు, క్యాన్సర్లు, చర్మ వ్యాధులు, అంతుచిక్కని వ్యాధులతో జనం సతమతమవుతున్నారు.
నాణ్యతలేని బియ్యం, నూనె,పసుపు,కుంకుమ, బెల్లం, పప్పు, ఉల్లిగడ్డ, వెల్లిగడ్డ,అల్లం,కూల్ డ్రింక్స్,బిస్కెట్లు, కురుకురే ప్యాకెట్లు, కొబ్బరికాయలను తీసుకొచ్చి, కిరాణా షాపులో ఏ గ్రేడ్ అని చెప్తూ, వ్యాపారస్తుల సిండికేట్ అయి, వీణవంక మండల కేంద్రంలోని ఓ కిరాణ షాప్ యజమాని, రాజకీయ నాయకులు అండ దండతో,వ్యాపారస్తుల అండదండతో మూడు పువ్వులు ఆరుకాయలుగా వ్యాపారం చేస్తూ, నిషేధిత వ్యాపారమైన గుడుంబా తయారీకి ఉపయోగించే పట్టికే బెల్లం , నల్ల బెల్లం, జీడిగింజలు సైతం యేచ్చేదగా అమ్ముకుంటూ, సామాన్యుని ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. ప్రతి కిరణా షాపులలో గుట్కా సంబంధమైన అంబర్ వంటి అమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. షాపులు ఎలక్ట్రికల్ కౌంటలు ఉన్న , బరువులలో వ్యత్యాసం వస్తుంది. మాన్యువల్ కాంటాలతో పోల్చుకుంటే, ఎలక్ట్రికల్ క్వాంటాలలో మోసం ఎక్కువ జరుగుతుందని వినియోదారులు ఆపోతున్నారు. రానున్న సమ్మక్క సారలమ్మ జాతరలో ఎత్తు బెల్లాలను మొక్కును చెల్లించే క్రమంలో ఎలక్ట్రిక్ క్వాంటల మోసాలతో మరింత నష్టపోయే ఆస్కారం ఉందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కావున
కిరాణా షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఇన్కమ్ టాక్స్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే, కిరాణా షాప్ లో యజమానుల ఇష్ట రాజ్యం నడుస్తుందని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని, కిరాణా షాప్ లో లభించే ప్రతి వస్తువుపై నాణ్యతను గుర్తించి, కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేయాలని వినియోదారులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment