సబ్ డివిజన్ ఎడిఈ లు కోడిరెక్క రవికుమార్, రవీందర్ రెడ్డి
మిర్యాలగూడ డివిజన్ మార్చి ఒకటి తెలంగాణ ఎక్స్ ప్రెస్: విద్యుత్తు వినియోగదారులు అర్హులైన వారికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం (వాడకం) వినియోగించుకున్న వినియోగదారులకు ఈరోజు ఫస్ట్ తారీకు నుండి జీరో బిల్లులు ఇవ్వడం జరుగుతున్నది మిర్యాలగూడ సబ్ డివిజన్ ఎడిఈ లు కోడిరెక్క రవికుమార్, రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉండి గృహ జ్యోతి రాని వినియోగదారులు వారి యొక్క ప్రజాపాలన దరఖాస్తులో పొందుపరిచిన రేషన్ కార్డు వివరాలు ఆధార్ కార్డు వివరాలు అన్ని మండలాల ఎంపీడీవో ఆఫీస్ లో మరియు మున్సిపాలిటీ ఆఫీసులో సరిచూచుకొని తరువాత మిర్యాలగూడ ఈఆర్ఓ డివిజన్ ఆఫీసు నందు వారి యొక్క ఇంటి కరెంట్ బిల్లు మరియు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారి ఆఫీసు నుండి పొందిన కంప్యూటర్ రసీదు కరెంట్ ఆఫీసులో చూయించి గృహ జ్యోతి పథకం కింద నమోదు చేయించుకోగలరు జీరో యూనిట్ బిల్లు రానివారు ఎలాంటి ఇబ్బందుల గురికాకుండా ఎంపీడీవో ఆఫీసులో పోర్టల్ లాగిన్ అవుతున్నారు కావున మీ యొక్క ఇంటి సర్వీస్ నెంబరు రేషన్ కార్డు నెంబరు ఆధార్ కార్డు నెంబరు మీ యొక్క మొబైల్ నెంబరు మరియొకసారి నమోదు చేయించుకుంటే ప్రతి వినియోగదారుడు కి జీరో బిల్ వస్తున్నది అర్హులైన వినియోగదారులు అందరూ విద్యుత్ సంస్థకు సహకరించగలరని కోరుతూ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్యుత్ అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎఈ లు వెంకటేశ్వర్లు, అమర్ సింగ్, వెంకటరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ మారం శ్రీనివాస్, సోమాచారి, మురళీమోహన్, సైదా, సురేందర్ రెడ్డి, కిరణ్, హేమంత్, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కోడి రెక్క శౌరి, కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, తిరుపతి రెడ్డి,కోడెరెక్క ఇంద్ర కుమార్, మహేశ్వరం రవి, నూనె గోపి, రాధా, జానకి, భీమమ్మ, తదితరులు పాల్గొన్నారు