Home తాజా వార్తలు యువజన క్రీడోత్సవాలు

యువజన క్రీడోత్సవాలు

by Telangana Express
  • అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ..

◆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాఠశాల కళాశాల విద్యార్థులకు కబడ్డీ పోటీలు

◆ విద్యార్థినిలకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు

  • ఏబీవీపీ రాష్ట్ర నాయకులు వినయ్ మక్తల్, జనవరి 19:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ): నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 21 ఆదివారము రోజు ఉదయం ప్రభుత్వ కళాశాల మైదానంలో పాఠశాల కళాశాల విద్యార్థులకు కబడ్డీ పోటీలు బాలికలకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ తెలియచేశారు.
    క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా
    ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే నేతాజీ జయంతి వేడుకలలో బహుమతులు అందచేయడం జరుగుతుందని తెలియచేశారు. కావున
    మఖ్తల్ లోని పాఠశాల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయగలరని కోరారు.
    పత్రికా సమావేశంలో ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ , శరణ్ , వినయ్ , నిఖిల్ , రాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment