మెదక్ జిల్లా డిసెంబర్ 21:
(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి)
హవేలీ ఘనపూర్ మండలంలోని కూచంపల్లి గ్రామానికి చెందిన ఈర్ల ప్రవీణ్ అనే యువరైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇట్టి విషయాన్ని గ్రామస్తులు కుటుంబీకులు కథనం ప్రకారం వారి యొక్క సొంత పొలంలో చదును చేసేందుకు అప్పులు తెచ్చి పొలాన్ని లెవెలింగ్ చేయించాడు అట్టి పొలంలో రబీ పంట చేసేందుకు నారు సైతం పోశాడు పొలంలో నీరు సరిగా నిల్వ ఉండకపోవడంతో పంట సరిగా పడటం లేదని ఆందోళన ఈ విషయాన్ని తోటి రైతులతో చెప్పుకొని రోదించాడు ఇదే కార్యక్రమంలో మనోవేదనతో ప్రవీణ్ శనివారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు గ్రామస్తులు హవేలీ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ కు తెలుపగా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమాస్టర్ నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు మృతుడి భార్య మమత ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
