ఉద్యోగం సాధించాలనే సంకల్పం ముందు ఓడిన పేదరికం
కోచింగ్ లేకుండానే… నాలుగు ఉద్యోగాలు సాధించిన యువతి
కోదాడ నియోజకవర్గం నడిగూడెం మార్చి 01 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
చదువుకోవాలనే పట్టుదల, ఉద్యోగం సాదించాలనే తపన ముందు పేదరికం చిన్నబోయింది. కష్ట పడి ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించింది ఓ యువతి మండల కేంద్రం లోని రామాపురం గ్రామానికి చెందిన మందుల ఈదయ్య, సుశీల దంపతుల చిన్న కుమార్తె మంగమ్మ స్టోరీ ఇది తల్లిదండ్రులు కలను సాకారం చేయాలనే సంకల్పం దాని కోసం మూడేళ్లు నిర్వీరామంగా కష్ట పడి గత సంవత్సరం నిర్వహించిన కేజివిబి పరీక్షలో పీజీటీ ఉద్యోగం సాధించడం తో పాటు, గురుకుల ఉపాధ్యాయుల నియామక ఫలితాలలో పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చర్ ఉద్యోగాలు సాధించి గ్రామ ప్రజల చేత ఔరా అనిపించుకుంటుంది. ఈ సందర్బంగా ఆమె పత్రిక ప్రకటన లో ఆమె మాట్లాడుతూ… ఉద్యోగం సాదించాలనే ఏకైక లక్ష్యం తో ఎలాంటి కోచింగ్ కు వెళ్లకుండా హైదరాబాద్ లో రూమ్ లోనే పుస్తకాలతో కుస్తీ పట్టడం తో ఈ ఉద్యోగాలు సాదించానని, సాధించాలనే లక్ష్యం ఉంటే ఎలాంటి విజయానినైనా సాధించవచ్చని అన్నారు.10 సంవత్సరాల క్రితమే నా తండ్రి మరణించిన మా అమ్మ, అక్క ల సహకారం, అన్నయ్య, ప్రెండ్స్, బంధువుల సూచనలే నా విజయానికి కారణాలు అన్నారు. జనరల్ జేఎల్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నని తెలిపారు.