మిర్యాలగూడ ఫిబ్రవరి 4 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ప్రత్యేక చొరవతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని పలు మేజర్లకు ఆదివారం నీటి విడుదల జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగాఉందనిప్రజలు,రైతులు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను మూడూ రోజుల క్రితం కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తాగునీటి అవసరాలకు తగిన నీటిని విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి ను రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా కలిసి కోరారు. స్పందించిన సిఏం నీటి విడుదలకు హామీ ఇచ్చారు.మారోవైపు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్వయంగా రంగంలో దిగి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎన్ఎస్పి ఆదికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరడంతో ఆధికారులు వెంటనే నీటి విడుదల చేశారని తెలుస్తుంది.దీంతో తాగునీటి సమస్యతో పాటు కొంత సాగునీటి సమస్య తీరుతుందని రైతులు పేర్కొన్నారు.నీటి విడుదల మరో మూడు నాలుగు రోజులు కొనసాగనుందని సమాచారం.
ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రత్యేక చొరవతో మేజర్లకు నీరు, తీరనున్న తాగునీటి సమస్య
61