రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నరసయ్య
వీణవంక, జనవరి 15( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా, సోమవారం మాడ సత్యనారాయణరెడ్డి స్మారకార్ధం యువత నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ బహుమతుల ప్రధాన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పోతుల నరసయ్య హాజరై మాట్లాడుతూ.. క్రీడలు శరీరక, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని,ప్రతి ఆటలో గెలుపు ఓటములు సహజమని, పండుగ రోజున క్రీడాకారులందరూ , ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులు క్రీడలపై మక్కువ కలిగి ఉండి, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతుల నరసయ్య, ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మీ భూమయ్య, మాడ సత్యనారాయణ రెడ్డి కుమారుడు మాడ సనత్ కుమార్ రెడ్డి, నిర్వాహకులు వార్డు సభ్యులు, క్రీడాకారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.