Home తాజా వార్తలు పారిశ్రామిక సమ్మె మరియు గ్రామీణ  బంద్ ను జయప్రదం చేయండి

పారిశ్రామిక సమ్మె మరియు గ్రామీణ  బంద్ ను జయప్రదం చేయండి

by Telangana Express

మక్తల్, ఫిబ్రవరి 10:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్ సమ్మె నోటీసు మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షులు కొలిమి రాములు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం ) పిలుపులో భాగంగా ఈ బంద్ ఉంటుందన్నారు గత పది సంవత్సరాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశంలో అనుసరిస్తున్న ఆర్థిక, మతతత్వ విధానాల ఫలితంగా ప్రజల జీవనాధాయం పడిపోయి పేదల సంఖ్య పెరిగిపోతున్నది, ఆక్సోపాం నివేదిక ప్రకారం దేశంలో 80 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువన మగ్గిపోతున్నారు 2024 ఏప్రిల్ లో రాబోతున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి రాయితీలను ప్రకటిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నది. చరిత్రత్మకమైన రైతన్న పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ రైతులకు రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది. ఈ కాలములో వాటిని అమలు చేయకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టెందుకు పూనుకున్నది అన్నారు.
భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని బడా కార్పొరేట్ దారులకు కట్టు బానిసలుగా మార్చేటటువంటి నాలుగు లేబర్ కోడ్లలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. కార్మికుల వేతనాలు రోజురోజుకి దిగజారి పోతున్నాయని అన్నారు. కార్మిక వర్గం యొక్క కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల దేశము యొక్క ఆర్థిక పురోగతి మందగించిందని అన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నివసిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ మరియు విద్యుత్ బిల్లు  రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు వాటాలు అమ్మడం ప్రైవేట్ పరాం చేయడం ఆపాలని కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మిట్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం శాఖలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేయాలనే డిమాండ్స్ తో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బందును  ఫిబ్రవరి 16 చేపట్టనున్నామని తెలిపారు. అసంఘటితరంగంలో కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమును ప్రవేశపెట్టాలి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం, ఐకెపి, ఫీల్డ్ అసిస్టెంట్, కస్తూరిబా,ఎన్నారై స్కీం వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనం చెల్లించాలని వారిని ప్రభుత్వం ఉద్యోగుల గుర్తించాలని దేశవ్యాప్తంగా జరుగుతునా సమ్మె లో కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా దరల పెరుగుదలను అరికట్టాలని ఆహార వస్తువులు మరియు నిత్యవసర వస్తువులపై జిఎస్టిని ఉపసంహరించుకోవాలని పెట్రోల్ డీజిల్ కిరోసిని వంట గ్యాస్ పై కేంద్రం ఎక్స్చేంజ్ కానీ తగ్గించాలని భవన నిర్మాణ కార్మికులకు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ని పెంచాలని తదితర డిమాండ్ తో  గ్రామీణ ప్రాంత  బంద్ లో రైతులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గంగన్న, ఆశన్న,రవి,బండారి బాలు,జి కృష్ణయ్య, మహేశ్వరమ్మ, శంకరమ్మ, సుజాత, ఆకాశ్, హన్మంతు, రామలింగం, వెంకటేష్,డి నర్సింలు, బండారి మల్లేష్, మారుతి, మారెప్ప జగ్గలి బాబు, జగ్గలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment