Home తాజా వార్తలు గిరిజనులలో పట్టున్న యువనేత “స్కైలాబ్ నాయక్” సైలెంట్ కు కారణం ఏమిటి?

గిరిజనులలో పట్టున్న యువనేత “స్కైలాబ్ నాయక్” సైలెంట్ కు కారణం ఏమిటి?

by Telangana Express

👉 మరోసారి బరిలో నిలుస్తారా..? మద్దతు ప్రకటిస్తారా.!

👉అధికార పార్టీలో ఆయన పయనమెటు.? స్కైలాబ్ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటని చర్చనీయాంశం..!

మిర్యాలగూడ నవంబర్ 1 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

ధీరావత్ స్కైలాబ్ నాయక్ 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి సత్తాచాటి మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోనే
రాగ్యా నాయక్ కుటుంబం. పరిచయమే అక్కర్లేని రాజకీయ నేపథ్యం, రాగ్యానాయక్ తనయుడుగా స్కైలాబ్ నాయక్ 2018 ఎన్నికల్లో పోటీ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో
గిరిజనులలో పట్టున్న జన ఆకర్షణ యువనేత స్కైలాబ్ నాయక్ సైలెంట్ కు కారణం ఏమిటి? ప్రస్తుత ఎన్నికల సమయం లో ఆయన పయన మెటో అనే ప్రశ్న సగటు ఆయన అభిమానులను గిరిజనులకు ఆలోచింపచేస్తుంది. రాగ్యా నాయక్ రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న యువ నేత స్కైలాబ్ నాయక్ ప్రస్తుత ఎన్నికల వేల మౌనం వహించడంలో ఆంతర్యం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా “కత్తెర “గుర్తుపై పోటీ చేసిన ఆయన ప్రధాన పోటీదారులతోపాటు విస్తృత ప్రచారం చేసి అనూహ్యంగా 14,000 ఓట్లను సాధించిన విషయం విధితమే. నియోజకవర్గ పోటీ దారుల్లో మూడో స్థానంలో నిలిచిన స్కైలాబ్ నాయక్ రాష్ట్రంలోని స్వతంత్ర అభ్యర్థుల ఓట్ల సాధనలో మూడోస్థానం పొందడం ఆయన చరిష్మాకు నిదర్శనంగా పలు పేర్కొంటున్నారు. గిరిజన యువనేతగా ఆ సామాజిక వర్గంలో నియోజకవర్గంలో పట్టున్న స్కైలాబ్ నాయక్ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బిఆర్ఎస్ అధికార పార్టీలో చేరిన స్కైలాబ్ నాయక్ ఉప ఎన్నికల్లో సైతం మిర్యాలగూడ నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేశారు. తన ప్రభావాన్ని చాటి ప్రస్తుతం అధికార పార్టీలో ఆయన స్తబ్దత ప్రజల్లో చర్చనీ యాంశంగా మారింది. ఎన్నికల సమయంలో స్కైలాబ్ నాయక్ నిర్లిప్తత అధికార పార్టీ మధ్య దూరం పెంచుతుందా..? సయోధ్య కుదురుతుందా అనే విషయం అంతుపట్టడం లేదనేది పలువురు పేర్కొంటున్నారు.మిర్యాలగూడ నియోజకవర్గంలో అత్యధిక శాతం గిరిజనుల ఓటు బ్యాంకు కలిగి ఉండడం, రాగ్యానాయక్ కుటుంబానికి మంచి ఆదరణ ఉండడంతో ఈనెల 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కైలాబ్ నాయక్ ఎన్నికల బరిలో మరోసారి ఇండిపెండెంట్ గా నిలబడతారా.? పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతిస్తారా.? లేక సొంతగూటికి చేరుతారా అనే విషయంపై నియోజకవర్గమంతటా చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉండగా స్కైలాబ్ నాయక్ మద్దతు కోసం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకటికి రెండుసార్లు చర్చలు జరిపినట్లు విశ్వసినీయంగా తెలిసింది. స్కైలాబ్ నాయక్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారో త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తుంది. మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment