Home తాజా వార్తలు మీకు అండగా మేముంటాం – మీ క్షేమం మా బాధ్యత,నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్.

మీకు అండగా మేముంటాం – మీ క్షేమం మా బాధ్యత,నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్.

by Telangana Express

నిర్మల్ జూలై 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్ (జిల్లా ప్రతినిధి): భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా నిర్మల్ జిల్లా ప్రజలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా వ్యవహరించాలని అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ కోరారు. అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం ఎదురైతే సహాయానికై వెంటనే డయల్ 100 చేయాలనీ లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగల కు దూరంగా ఉండాలని, విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదని,
చిన్నపిల్లలను బయటకు పంపరాదని తెలిపారు.
సాధ్యమైనంతవరకు ఇంట్లో గల ఎలక్ట్రానిక్ వస్తువుల కేబుల్స్ విడిగా ఉంచాలని
పిడుగుపాటు దృశ్య వర్షంలొ ఎవరు చెట్ల కింద ఆశ్రయం పొందరాదన్నారు. పొలాల వద్దకు రైతులు మొబైల్ ఫోన్స్ తీసుకుపోరాదని, తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాల వల్ల చెట్లు విరిగి ఎలక్ట్రిక్ వైర్ల పై పడడం వల్ల రహదారులు, పొలాలపై పడి ఉంటాయి కావున రైతులు జాగ్రత్తగా గమనించాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను ఆహారాన్ని జాగ్రత్త పరుచుకోవాలని. కూలిపోయే స్థితిలో ఉన్న మట్టి గోడలతో ఉన్న ఇండ్లు పాత భవనాలు వెంటనే కాలి చేసి సురక్షత ప్రాంతాలకు వెళ్ళాలన్నారు. వర్షాల కారణంగా బ్లాక్ అయిన రహదారులను జాగ్రత్తగా దాటాలన్నారు. రోడ్ల పై గల మ్యానహోల్స్ కు దూరంగా నడవవలని వర్షం వల్ల వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం వుంటుందని జాగ్రత్తగా నడపాలని, అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళరాదని, వర్షాల కారణంగా ప్రభలే విషజ్వరాలు, అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వలన ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చుని సూచించారు. ప్రజల క్షేమమే మా బాధ్యత అని సూచనలు పాటించాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి సహకరించాలని వారు కోరారు.

You may also like

Leave a Comment