పత్తి కొండల్ రెడ్డి ని పరమర్శించిన ఒడితల ప్రణవ్ ..
ప్రతి జర్నలిస్టు కు కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలుస్తుంది..
వీణవంక, జనవరి 16( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ మంగళవారం వీణవంక మండలంలో పలు కుటుంబాలను పరామర్శించారు. వీణవంక మండల కేంద్రానికి చెందిన ఘంటారావం రిపోర్టర్ పత్తి కొండల్ రెడ్డి , ఇటీవల కాలంలో పక్షవాతానికి గురై, హనుమకొండ మాక్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొంది, గత రెండు రోజుల క్రితం ఇంటికి రాగా, విషయం తెలుసుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, మండల నాయకులతో కలిసి పత్తి కొండ రెడ్డిని తన నివాస గృహంలో పరామర్శించి,కుటుంబ సభ్యులతో ఆరోగ్య సమస్య పై చర్చించి, కుటుంబానికి, కొండల్ రెడ్డి ఆరోగ్యానికి భద్రత కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ నుండి సహాయం అందిస్తామని, భరోసా కల్పించారు. అనంతరం శ్రీరాముల పేట గ్రామానికి చెందిన కోల సంతోష్ , జమ్మికుంటలో కుటుంబ తగాదాల కారణాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొని చనిపోగా, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మ్యాక వీరయ్య మాతృమూర్తి మ్యాక బుచ్చి రాజమ్మ,ఇటీవలే పరమపదించగా , వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదే గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పోడేటి రామస్వామి అనారోగ్య కారణాలతో బాధపడుతుంటే, వారిని పరామర్శించి, వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు.

అనంతరం వీణవంక టీ టైపులో టీ తాగుతూ , మండల గ్రామ నాయకులతో, కొంతసేపు ముచ్చటించారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు ఆరోగ్యానికి భద్రత కలుగుతుందని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం వర్తిస్తుందని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా అందిస్తుందని, జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, జర్నలిస్టులు అధైర్యపడవద్దని, మీకు రావాల్సిన ప్రతి పథకానికి మీరు అర్హులేనని, హుజురాబాద్ లో ప్రతి జర్నలిస్టుకు అండగా మేముంటామని,నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, అభయ హస్తం కింద 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి చేర్చే క్రమంలో పారదర్శకతతో ప్రజాపాలన ఉంటుందని, కార్యకర్తలు ప్రభుత్వానికి,ప్రజలకు అనుసంధానంగా ఉండాలని సూచించారు.ఈ పరామర్శ లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ తో పాటుగా, ట్రస్మా మాజీ అధ్యక్షులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అతిధి డెవలపర్స్ అధినేత కోమ్మిడి రాకేష్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ నల్ల కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు సాహెబ్ హుస్సేన్, నల్ల కొండల్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, విశ్వకర్మ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఉదారపు నరసింహ చారి, కురుమిండ్ల తిరుపతయ్య,గొట్టే రాజయ్య,పైడి కుమార్,పోతర వేన సతీష్ కుమార్,కుమార్ రెడ్డి,మోహన్ రెడ్డి, సమ్మయ్య,మైనార్టీ నాయకులు ఎజాజ్ పాషా, అజ్జు పాషా తదితరులు పాల్గొన్నారు.