అభినందించిన ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి
చిగురుమామిడి డిసెంబర్ 8
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
చిగురుమామిడి మండల కేంద్రంలో గల ఉన్నత
పాఠశాలలో లక్ష 20వేల రూపాయల విలువ గల రిఫ్రిజిరేటర్, వాటర్ ప్యూరిఫైయర్ ను అందజేశారు. వాషింగ్టన్ లో ఉంటున్న ప్రవాస తెలంగాణ వాసులు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ను 2014లో స్థాపించి, సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలను అమెరికాలోని పిల్లలు తెలుసుకునేలా తెలంగాణ ఏర్పాటు దినోత్సవం, బతుకమ్మ సంబరాలు, వన భోజనాలు నిర్వహిస్తున్నారు. వాటితోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాట్ జీ హోప్ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందజేస్తున్నారు. ఈ సంవత్సరం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, కథలాపూర్ మండలాలలో 4.5 లక్షల విలువైన ఐదు వాటర్ ప్యూరిఫైయర్ ను విద్యార్థులకు అందజేశారు. విదేశాలలో ఉండి కూడా వారు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రేమతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షురాలు కుంభం శ్రావణి, ఉపాధ్యక్షుడు పన్యాల నాగార్జున రెడ్డి, అసోసియేషన్ సభ్యులను ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి, అసోసియేషన్ సభ్యుడు పన్యాల రాజశేఖర్ రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు భూపతిరెడ్డి, పన్యాల మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.