- జడ్పీ చైర్ పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్
-రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం.
నారాయణపేట జిల్లా, ప్రతినిధి, నవంబర్ 5 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నారాయణపేట జిల్లా పరిషత్ చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్ మక్తల్ పట్టణంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరెందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బిఆర్ఎస్ పార్టీలోని మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేతో అంతర్గత విభేదాలు, ద్వేషాలతో, నాలుగున్నర సంవత్సరాలు ఓపిక పట్టి నెట్టుకొచ్చినట్టు, ఇక ఇమడలేనని, అదికాక నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పై విమర్శన అస్త్రాలు సంధించారు. అలాగే వ్యక్తిగత కారణాలతో బిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు జెడ్పీ చైర్ పర్సన్ వనజ ఆంజనేయులు తెలియజేశారు. ఆదివారం నాడు తన అనుచరులతో భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ బయలుదేరిన జడ్పీ చైర్ పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్.