బిచ్కుంద డిసెంబర్ 29 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
జుక్కల్ నియోజకవర్గ వీరశైవ లింగాయత్ సమాజ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం రోజున మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా మఠాధిపతి సోమలింగ శివాచార్య మహారాజ్ మరియు మల్లికార్జునప్ప శెట్కార్, లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షులు,పెద్దలు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరియు వీరశైవ లింగాయత్ ముద్దుబిడ్డ బిచ్కుంద మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ స్వర్గస్థులవ్వటం, వారి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వీరశైవ లింగాయత్ సమాజంలో ఉన్నత పదవులలో ఉన్న వారిని శాలువా లతో సన్మానించుకున్నారు.వారు మాట్లాడుతూ వీరశైవ లింగయత్ సమాజం ఐకమత్యం గా ఉండాలని, లింగాయత్ సమాజం లోని సభ్యులు అభివృద్ధి చెందడానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా అందిస్తామని, మనం కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించాలని, ముఖ్యంగా లింగాయత్ సమాజంలోని సభ్యులు ఏకతాటిపైకి రావాలని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామం నుంచి కమిటీలను ఏర్పాటు చేయ్యాలని అన్నారు.ఈ విషయం పై కార్యక్రమానికి వచ్చిన అందరి అభిప్రాయాలను, సలహాలను సూచనలను అందించారు. అందరూ ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ధర్మానికి కష్టం వచ్చినప్పుడు పార్టీలకతీతంగా అందరూ ఐక్యమత్యంతో ఉండి ముందుండి నడిపించాలని అన్నారు. తమ ధర్మానికి సంబంధించి ధర్మ ప్రచార కార్యకర్తలు శ్రీశైలంలో కావచ్చు, జిల్లా స్థాయిలో కూడా వీరశైవ లింగాయత్ ల ధర్మం, గొప్పతనం, ఆవిర్భావం గురించి ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్క వీరశైవ లింగాయత్ బాంధవుడు అటువంటి సభలలో పాల్గొని వీరశైవ లింగయత్ ధర్మం గురించి తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీరశైవ లింగాయత్ సోదరులు పాల్గొన్నారు.
