ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని మౌలన్ ఖెడ్ గ్రామ శివారులోని వీరన్న కుచ్చపై గల వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ పూజలు, బుధవారం వసంత పంచమినీ పురస్కరించుకుని ఆలయ పూజారి పెద్ద సంగప్ప, వీర సంగప్ప, ఈశ్వరప్పలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నీల కంటేశ్వర ఆలయం నుంచి వీరభద్ర స్వామి ఉత్సవ విగ్రహాన్ని, శివ మాలాదారా స్వాములు ఊరేగింపు గా భాజా భజంత్రీలతో వీరన్న కుచ్చ వరకు తీసుకు వెళ్లి అక్కడ అభిషేకాలు, బిల్వార్చన, పుష్పార్చన , రుద్ర హోమం నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మాజీ ఎంపిపి, మాజీ వైస్ ఎంపిపి లు చెన్న లక్ష్మణ్, చెన్న సతీష్ లు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై వీరభద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసా దాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివ మాలాధార స్వాములు, హన్మంతప్ప, గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు కాశీరాం, పూజారులు సందీప్ అప్ప, నీలకంఠం అప్ప , భక్తులు తదితరులు పాల్గొన్నారు. గురువారం తెల్లవారు జామున అగ్నిగుండాల కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని ఆలయ పూజారులు తెలిపారు.