మిర్యాలగూడ ఫిబ్రవరి 3 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వీర్లపాలెంలో చిన్నారులు తరగతి గదులకు వెళ్లి పాఠ్యాంశాలు బోధించిన తీరు గ్రామస్తులకు, విద్యా కమిటీ ఉపాధ్యాయులకు ఆకట్టుకుంది. దామరచర్ల మండలం వీర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో శనివారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు.

పాఠశాల చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా అధికారులుగా ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను నిర్వర్తించారు. విద్యాశాఖ మంత్రిగా ఎం తేజస్విని, డి ఈ ఓ గా మహేశ్వరి, ఎం ఈ ఓ గా అశ్విత, హెచ్ఎంగా అశ్వంత్ లు వ్యవహరించారు.

ఈ సందర్భంగా ప్రతిభా కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు ఆడోతు శంకర్, ఉపాధ్యాయినీలు నసీమునిసాబేగం, హారిత, బహుమతులు అందజేయగా మిర్యాలగూడ పట్టణం చెందిన వాసవి, వనిత క్లబల ఉపాధ్యక్షురాలు మాశెట్టి గీతా (డైమండ్) తన వంతు చేయూత అందించారు.
