Home తాజా వార్తలు అయ్యప్ప స్వామి ఆలయంలోవసంత పంచమి వేడుకలు…గణపతి హోమం… అన్నప్రసాదం

అయ్యప్ప స్వామి ఆలయంలోవసంత పంచమి వేడుకలు…గణపతి హోమం… అన్నప్రసాదం

by Telangana Express

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక హరి హర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో, బుధవారం 8 వ వార్షికోత్సవం, వసంత పంచమి వేడుకలను అయ్యప్ప సేవా సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శ్రీనివాస్ రావు పంతులు ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ చేసి జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. మాలికపురోత్తమ మాతకు, సుబ్రహ్మణ్య స్వామికి భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ మామిడి అరవింద్ కుమార్ , బొందుగుల రాజేందర్ రావు, కాపర్తి శివశంకర్ దంపతులచే ఆలయ పూజారి ముత్యాల శ్రీనివాస్ రావు పంతులు చేయించారు. అనంతరం అయ్యప్ప స్వామికి అన్నప్రసాద నైవేద్యం సమర్పించి, పదునెట్టంబడి మెట్ల పడిని మాలాధారా స్వాములతో పాటు ఆలయ సేవాసమితి కమిటీ అధ్యక్షులు పద్మ శ్రీకాంత్ కలిసి వెలిగించారు. పడి పూజ అనంతరం భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, ఆలయ గౌరవ అధ్యక్షులు ముదిగొండ చంద్రం, ప్రధాన కార్యదర్శి వుక్కల్కర్ రాజేందర్ నాథ్, జాయింట్ కార్యదర్శి రాములు, మురళి, సతీష్, సుగునాకర్ , భూపాల్, మలాధార స్వాములు శివకుమార్ స్వామి, ఈశ్వర్ స్వామి, ఇద్దరు చిన్న కన్నె స్వాములు, తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పల్లకి సేవ నిర్వహించారు.

You may also like

Leave a Comment