Home తాజా వార్తలు వాణి విద్యాలయం డిజిటల్ హై స్కూల్ 29 వ వార్షికోత్సవ వేడుకలు

వాణి విద్యాలయం డిజిటల్ హై స్కూల్ 29 వ వార్షికోత్సవ వేడుకలు

by Telangana Express


తెలంగాణ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రతినిధి ఫిబ్రవరి 25 వేములవాడ
వాణి విద్యాలయం డిజి హై స్కూల్ 29వ వార్షికోత్సవానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ రాము గారు కరస్పాండెంట్ అనంత రెడ్డి
గారు వైస్ ప్రిన్సిపల్ మహేష్ గారు ఘన స్వాగతం పలికారు.


కార్యక్రమానికి meo బన్నాజీ గారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రస్మా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,పేరెంట్స్ కమిటీ చైర్మన్ బి నవీన్ కుమార్,
వార్డ్ కౌన్సిలర్ బింగి మహేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


అనంతరం ఆది శ్రీనివాస్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .


గత సంవత్సరం పదవ తరగతి 10 /10 GP ఉత్తీర్త సాధించిన విద్యార్థిని రామిడి శ్రీనివాస్ మంగ దంపతుల కుమార్తె రిషిత కు మరియు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి విద్యార్థులకు శాలువా మరియు షీల్డ్ తో సత్కరించి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మరియు స్కూల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థుల మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు అనంతరం స్కూల్ కరస్పాండెంట్ అనంత రెడ్డి గారు 1995 లో స్కూల్ స్కూల్ ప్రారంభించి ఇప్పటివరకు దాదాపు 29 సంవత్సరాలు పూర్తయింది.

అప్పటినుండి ఇప్పటివరకు మాకు సహకరించిన విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు జానపదం డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు.

You may also like

Leave a Comment