వెటర్నరీ డాక్టర్ భాను నాయక్
కడ్తాల్, మార్చ్ 12
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో వెటర్నరీ డాక్టర్ భాను నాయక్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భాను నాయక్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా తమ పశువులకు గాలికుంటు టీకాలు వేయించుకోవాలని సూచించారు. మంగళవారం మండల పరిధిలోని న్యామతాపూర్, కాడ్య తండా, బాలాజీ నగర్, కడ్తాల్ గ్రామాలలో గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేవిఓ రాజేష్. మల్లేష్, వెంకటయ్య, రమేష్, అప్సర్, బురానుద్దీన్, చంద్రశేఖర్, వాల్య నాయక్, సంజీవ, గోపాల మిత్రులు, నవీన్, శ్రీశైలం, తదితర రైతులు పాల్గొనడం జరిగింది.