తెలంగాణ ఎక్స్ ప్రెస్ 23/12/24
భైంసా పట్టణం లోని
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు యూఎస్ఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు.
ఈరోజు భారత్ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక నిర్మల్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతుగా యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను పట్టించుకోవడంలేదని తామ అధికారంలోకి వస్తే వారందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పిన ఇప్పటి ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను మర్చిపోవడం చూస్తుంటే పాలకవర్గం మారిందే తప్ప పాలన కాదు అని అర్థమవుతుంది అని అన్నారు. అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 1080 రోజుల ప్రసతి సెలవులు ఇవ్వాలి.మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పదిహేను లక్షలు ఇస్తే కల్పించాలి.ఆరవై ఒకటి సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు ముప్పై లక్షల రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనే డిమాండ్లతో శాంతియుతంగా నిరావధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించే రకంగా కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ వినయ్ ధమ్మపాల్ స్వామి భూమేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
