ఐక్యత మహాసభలను జయప్రదం చేయాలి
బోధన్ రూరల్,ఫిబ్రవరి22:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మార్చి 3, 4, 5 తేదీలలో ఖమ్మం జిల్లాలో జరిగే మూడు కమ్యూనిస్టు పార్టీల జాతీయ ఐక్యత మహాసభల గోడ ప్రతులను గురువారం సాలూరా మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బి.మల్లేష్ మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే ఐక్యత మహాసభలు ఒక ముందడుగు లాంటిదని పేర్కొన్నారు. ఈ మహాసభలకు పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, సంతోష్, రాజు, ఈర్షద్, కాజా, నగేష్, మారుతి, తదితరులు పాల్గొన్నారు.
ఐక్యత మహాసభలను జయప్రదం చేయాలి
48
previous post