భయభ్రాంతులకు గురైన మహిళలు
తెలంగాణ పోలీస్ 100కు సమాచారం
గంట తర్వాత స్పందించిన పోలీసులు
మంచిర్యాల, ఫిబ్రవరి 16, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోనకల్ గ్రామ పరిధిలో 13వ భాగం గల్లీలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి సమీపంలో తిరుగుతుండగా మహిళలు భయభ్రాంతులకు గురైయ్యారు. స్థానికుల కథనం ప్రకారం శుక్రవారం సూమరు రాత్రి 8:30 గంటలకు ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తెల్ల బట్టలు ధరించి, నల్లటి బూట్లు వేసుకొని ఇంటి సమీపంలో తిరిగారని తెలిపారు. జన్నారం మండల సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసిన స్పందించడం జరగలేదన్నారు. తెలంగాణ పోలీస్ 100కు రాత్రి 8 గంటల 47 గుర్తు తెలియని వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోనకల్ గ్రామంలో వెంకటేశ్వర్లు గుడి తర్వాత ప్రభుత్వ పాఠశాల ముందు బోరింగ్ ఎదురుగా పరిధిలో 13వ వార్డులో మొదటి కాలనీలో ఇంటి సమీపంలో తిరుగుతుండగా భయభ్రాంతులకు గురవుతున్నామని తెలంగాణ పోలీస్ కు సమాచారం అందివ్వడంతో, గంట తర్వాత సమాచారం అందించిన ఘటన స్థలానికి జన్నారం పోలీసులు చేరుకున్నారు. పోనకల్ గ్రామ 13 వార్డ్ మధ్య కాలనీ నుండి వ్యవసాయ పొలాల గూండా అడవి ప్రాంతం వైపు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళారని తెలిపారు. జన్నారం మండలం పోనకల్ కాలనీ వాసులు తెలిపిన సమాచారం ప్రకారం తెలంగాణ పోలీస్ 100కు సమాచారం అందించిన వేంటనే ఘటన స్థలానికి చేరుకొని జన్నారం పోలీసులు గాలింపు చర్యలు చేపడితే గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేవారని స్థానికులు తెలిపారు.