మంచిర్యాల, నవంబర్ 16, (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పలు గ్రామాల్లో బీజేవైఎం మండల అధ్యక్షులు ముడుగు ప్రవీణ్ బిజెపి పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. గురువారం జన్నారం పట్టణంలోని ఉదయం 10 గంటలకు బేబీ సంతలో, రోడ్డు వైపు ఉన్న పలు వ్యాపారవేత్తలను కలిసి గడప గడపకు తిరుగుతూ బిజెపి గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అనే కా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, ఖానాపూర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాథోడ్ రమేష్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరాడు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, చిన్న గౌడ్, శరత్, మహేష్ గౌడ్, రాస మల్ల గౌడ్, ప్రజలు పాల్గొన్నారు.
బీజేవైఎం ఆధ్వర్యంలో బిజెపి గెలుపు కోసం గడప గడప కు ప్రచారం
43
previous post