*
మిర్యాలగూడ డిసెంబర్ 24 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
క్రిస్మస్ పండుగ సందర్భంగా
క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ *క్రిస్మస్* శుభాకాంక్షలు తెలియజేస్తూ మిర్యాలగూడ ఎమ్మెల్యే
బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్) ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో మిర్యాలగూడ పట్టణంలోని అన్ని వార్డులలో కేకుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్చార్జులు, మున్సిపల్ వార్డులలో కౌన్సిలర్లు, వార్డ్ ఇన్చార్జులు కేకుల పంపిణీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
21వ వార్డు బాపూజీ నగర్ లో కేకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. యేసయ్య దీవెనలు ఆశీర్వాదాలు పవిత్ర ప్రేమ బత్తుల లక్ష్మారెడ్డి పై ఉండాలని, రాబోయే 20 సంవత్సరాలు బి ఎల్ ఆర్ ఎమ్మెల్యేగా ఉండాలని, ఆయన చేసే ప్రజా సేవ ప్రజల కోసమే నిత్యం ఆయన పడే తపన ఆయన ఉక్కు సంకల్పం వర్ణించలేనివి పేర్కొన్నారు. 21 వార్డులో బిఎల్ఆర్ సోషల్ మీడియా కన్వీనర్ పాతూరి శరత్ తదితరులు పాల్గొన్నారు.

