వీణవంక, అక్టోబర్ 22( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి, ఆదివారం అంగరంగ వైభవంగా జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకలలో పాల్గొని, మహిళలను, గ్రామ ప్రజలను కలుసుకున్నారు. తెలంగాణలో జరిగే పండుగలలో మహిళలకు ప్రాధాన్యత నిచ్చే పూల పండుగ, బతుకమ్మ పండుగ అని, పేద ధనికైనా తేడా లేకుండా జరుపుకునే ఆత్మీయ పండుగ తెలంగాణలో సంస్కృతి,ఆచార సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ బతుకమ్మ పండుగ అని అన్నారు. యుఫ్ టీవీ సీఈఓ వెంట కుమారుడు ప్రద్యున్, మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టి,చందు, లోకేష్, శ్రీకాంత్, రాకేష్, వంశీ తదితరులు ఉన్నారు.