Home తాజా వార్తలు కుటుంబ సమేతంగా సమ్మక్క- సారలమ్మను దర్శించుకున్న ధర్మకర్త, యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి

కుటుంబ సమేతంగా సమ్మక్క- సారలమ్మను దర్శించుకున్న ధర్మకర్త, యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి

by Telangana Express

వీణవంక, ఫిబ్రవరి 23( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో జరుగుతున్న సమ్మక్క- సారలమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగగా, జాతర ధర్మకర్తలు పాడి రామ క్రిష్ణారెడ్డి సతీమణి సుకన్య దేవి,
యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి సతీమణి పాడి శిరీష రెడ్డి, వారి మాతృమూర్తి పాడి లీలావతి తో పాటు,కుటుంబ సమేతంగా, సమ్మక్క- సారలమ్మలకు ఎత్తు బంగారాన్ని సమర్పిస్తూ, గిరిజన కోయ పూజారులతో ప్రత్యేక పూజలు చేస్తూ, అమ్మవార్లకు టెంకాయలు కొడుతూ, ముడుపులు కడుతూ, వనదేవతల మొక్కులు చెల్లించుకుని, బయటి ద్వారం వద్ద కోరిన కోరికలు తీర్చే మొక్కు అయినా ఎదురుగా కోళ్లను ఎగరవేశారు.అనంతరం వారు మాట్లాడుతూ… సకల అష్ట ఐశ్వర్యాలు ఇచ్చే సమ్మక్క- సారలమ్మల ఆశీర్వాదంతో మా కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గత 60 ఏళ్లుగా వీణవంకలో జాతర నిర్వహణ జరుగుతుందని, వీణవంక గ్రామంలోని ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖశాంతులతో, రైతన్నలు సుభిక్షంగా , అష్టైశ్వర్యాలతో తులతూగాలని, అమ్మవార్ల ఆశీర్వాదంతో గ్రామంలోని ప్రజలందరూ ఆనంద ఉత్సాహాలతో , సిరి సంపదలతో తులతూగాలని వనదేవతలు ప్రార్థించామన్నారు.

వీణవంకలో మా తాత పాడి సుధాకర్ రెడ్డి హయాం నుండి ప్రారంభమైందని,ఈ సంవత్సరం పాడి రామకృష్ణారెడ్డి, పాడి రాజిరెడ్డి, పాడి ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో జాతర నిర్వహణ జరుగుతుందని, గత 60 ఏళ్లుగా జరుగుతున్న జాతర నిర్వహణకు మా కుటుంబానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని, అలాగే మీ అందరికీ ఎల్లప్పుడూ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తోడుగా ఉంటుందన్నారు.

ఈ దర్శన కార్యక్రమంలో యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి వెంట, వేద బ్రాహ్మణులు గూడ జగదీశ్వర శర్మ, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్, మాజీ సర్పంచ్ ఐలయ్య,అమృత ప్రభాకర్, సమ్మిండ్ల బాబురావు, సమ్మిండ్ల చిట్టి, జోజుల ప్రహ్లాద రావు, గంగాడి రాజిరెడ్డి, మాదాసు సునీల్, నారాయణ, శ్రీధర్, మల్లయ్య,లోకేష్, వంశీ,రాజు,అఖిల్,శ్రీకాంత్, కుమారస్వామి, రాజశేఖర్, కుమారస్వామి, ఎల్లయ్య , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment