– ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
బిచ్కుంద జనవరి 23:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న మొదటిసారిగా కౌలాస్ కోటపై జాతీయ జెండా ఎగరవేయనున్న నేపథ్యంలో
కోటకు వెళ్లే రోడ్డు పనులు,కోటపై జెండా ఎగరవేయడానికి దిమ్మె ఇతర పనులను తానే స్వయంగా బుల్లెట్ బండి నడుపుకుంటూ వెళ్లి దగ్గరుండి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జరుగుతున్న పనులను పరిశీలించారు.మొదటి సారి కౌలాస్ కోటపై జాతీయ జెండా ఎగురనుండటం తో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట అనిత సింగ్,సాయి పటేల్, బాలు యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
