తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులు గౌడ్
మిర్యాలగూడ డివిజన్ ఏప్రిల్ 2 తెలంగాణ ఎక్స్ ప్రెస్: మొగలాయీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన దక్షిణ భారత యోదుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పీడిత వర్గ పోరాట యోధుడు, గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసిన గెరిల్లా పోరాట యోధుడు సర్దార్ సర్వాయు పాపన్న గౌడ్ అని కొనియాడారు. పాపన్న వర్దంతిని పురస్కరించుకొని ఆయన జీవిత చరిత్రను మరియు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని ప్రభుత్వం అధికారికంగా జయంతి వర్దంతి ని చేయాలని డిమాండ్ చేశారు. చదువు లేకున్నా సామాన్యుడు అసామాన్యమైన పోరాటం చేసి రాజ్యాన్ని ఏలచ్చో నేర్పన చరిత్ర కారుడు.మొదటి బహుజన నాయకుడు, 21 కోటలు కట్టి బహుజన రాజ్యం విముక్తి చేసిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ రాష్ట్ర కార్యదర్శి కర్నాటి శివరామకృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుణగంటి వెంకన్న గౌడ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, యాదవ సంఘం డివిజన్ అధ్యక్షులు చేయకుండా మురళి యాదవ్, గౌడ సంఘం నాయకులు గాలి శ్రవణ్ గౌడ్ ,గుణగంటి రవి గౌడ్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.