టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోగుల సైదులు గౌడ్
మిర్యాలగూడ డివిజన్ జనవరి 18 తెలంగాణ ఎక్స్ ప్రెస్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రివర్యులు సీనీ రంగంలో మకుటం లేని మహారాజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక బస్టాండ్ సమీపలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి బానిసత్వం నుండి పటేల్ పట్వారి వ్యవస్థ నుండి తొలగించి పేద ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, గృహంలేని పేద ప్రజలకు పక్క గృహ నిర్మాణాలు కడునిరుపేదకు సంక్షేమ పథకాలు కూడు గూడు గుడ్డ అనేక నినాదంతో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన
ఆ మహనీయుడు తెలుగుజాతికి ప్రజలందరి అభిమానాన్ని పొందిన మహా నాయకుడు అని కొనియాడారు సినీ వినీలాకాశంలో శ్రీ నటసార్వభౌమ, నటరత్న,పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ రాష్ట్ర నాయకులు, జడ రాములు యాదవ్ బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి పోగుల సైదులు గౌడ్, అనుబంధ సంఘ నాయకులు ముక్కెర రంజి బాబు జిల్లా ఉపాధ్యక్షులు మాన్య నాయక్ ,జిల్లా అనుబంధ సంఘాల నాయకులు ఎండి జానిమియా ,సైదా నాయక్ మండల నాయకులు చిలకల వెంకన్న, షేక్ రసూల్, జయ రామాచారి మరియు కమ్మ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.