Home తాజా వార్తలు చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం మహా పాదయాత్రలో నివాళులు

చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం మహా పాదయాత్రలో నివాళులు

by Telangana Express

ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్

మిర్యాలగూడ డివిజన్ మార్చి 6 తెలంగాణ ఎక్స్ ప్రెస్: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం తలపెట్టిన మహా పాదయాత్ర మద్దతుగా యాత్రలో పాల్గొని భాగంగా వంద రోజులు పూర్తి చేసుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ మేమెంతో మాకు అంత నినాదంతో చట్టసభల్లో బిసి వాటా మరియు కులగణన ఆధారంగా రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర నాయకత్వం మార్చి 1వ తేదీన మీర్ గాని పల్లి గ్రామం నుండి కిలాషపూర్ కోట వరకు చేపడుతున్న మహా పాదయాత్ర కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ నాయకులందరూ పాల్గొని బ్రహ్మరథం తెలుపుతూ ముందుకు సాగే బీసీల యాత్రను చూసి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న ఈ పాదయాత్ర ద్వారా 60 శాతం ఉన్న బీసీ జనాభాకు 15% రిజర్వేషన్లే కల్పించడాన్ని ఎండగడుతూ బీసీల హక్కుల సాధన ధ్యేయంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ముందుకు సాగే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు ప్రకటించకపోతే ఉద్యమ ఉవ్వెత్తిన ఎగసిపడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కన్నడ శివరామకృష్ణ, రాష్ట్ర నాయకులు పొదిల సతీష్ గౌడ్, సరిపెల్లి కరుణాకర్”, వడ్డే పోయిన సతీష్, బీసీ యువజన సంక్షేమ విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment