కొడిమ్యాల, ఆగస్టు 07 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కొడిమ్యాల పట్టణానికి చెందిన యువతి మృతి చెందిన ఘటన
తేదీ 6-8-2025 (బుధవారం) రాత్రి సుమారు 9 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో
గుర్రం శంకరవ్వ భర్త కి. శే .సత్తయ్య (గౌడ్) అనునామె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, తన కూతురు గుర్రం మమత (30) తాటిపల్లి గ్రామానికి చెందిన గంగాధర స్వామి దుర్గయ్య అనే వ్యక్తితో కలిసి వేములవాడ నుండి బైక్ పై కొడిమ్యాల వెళ్తుండగా,చెప్యాల గ్రామ శివారులో అతని వాహనం అధిక వేగంతో ఉండటంతో,రోడ్డుపై గల గుంతలను దాటే సమయంలో బైక్ లో నిలుపుదల కోల్పోయింది.ఈ ప్రమాదంలో మమత కుడికాలుతో బైక్ వెనుక చక్రాల్లో ఇరికి కింద పడిపోయింది.తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించబోయినా,అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ మేరకు బాధితురాలి తల్లి శంకరవ్వ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొడిమ్యాల ఎస్‌ఐ సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
