మినీ మేడారానికి ఘన స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు..
సకల వసతులతో సకలజనులకు ఆహ్వానం..
ధర్మకర్తలు పాడి రామకృష్ణారెడ్డి,పాడి రాజిరెడ్డి, పాడి ఉదయ నందన్ రెడ్డి.
వీణవంక, ఫిబ్రవరి 20 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో తో పాటుగా , కోర్కల్, చల్లూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాలలో సమ్మక్క -సారలమ్మ జాతర ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఫిబ్రవరి 21 బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు వచ్చుట, ఫిబ్రవరి 22 గురువారం సమ్మక్క గద్దెకు వచ్చుట, ఫిబ్రవరి 22 రాత్రి నుండి, ఫిబ్రవరి 23 శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులు మొక్కులు చెల్లించుకొనుట, ఫిబ్రవరి 24 శనివారం వనదేవతలు వన ప్రవేశం చేయుట జరుగును. మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన వీణవంక సమ్మక్క -సారలమ్మ జాతర ఏర్పాట్లను ముమ్మరంగా ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణ కమిటీ, ధర్మకర్తలు పాడి రామకృష్ణారెడ్డి, పాడి రాజిరెడ్డి,
యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయనందన్ రెడ్డి ల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతర నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నది. ధర్మకర్తలు జాతరలో భక్తులు కావలసిన బస్సు సౌకర్యం,త్రాగునీరు, విద్యుత్, వైద్యం, పార్కింగ్, పోలీస్ బందోబస్తు, వాలంటరీ బందోబస్తు, ఎంక్వయిరీ అనౌన్స్మెంట్, అన్ని రకాల సౌకర్యాలతో కూడిన జాతర ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులందరినీ జాతరకు
సకల సౌకర్యాలతో సకలజనులకు స్వాగతం పలుకుతున్నారు.

వీణవంక సమ్మక్క- సారలమ్మ జాతరకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ, ప్రతిసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర, మొదటి ఘట్టం సారలమ్మ రాక బుధవారం నాడు వనం నుండి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై , గ్రామ పురవీధుల గుండా ఆలయ ప్రాంగణానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుందని, అశేష భక్త జనావళి మధ్య, గొల్ల కురుమల ఒగ్గుడోల విన్యాసాల మధ్య, కోయ పూజారుల, శివశక్తుల పూనకాల మధ్య, గ్రామ ప్రజల సంతోష సంబరాలు నడుమ సారాలమ్మ రాక అద్భుత ఆవిష్కరణతో కూడిన, జానపద జాతర, వన జాతరను తలపించే జన జాతర మధ్య , భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారమై, భక్తులు సమర్పించే ఎత్తు బంగారం, కోడి పిల్లలు, మేకపిల్లలు, గొర్రెపోతులను సైతం సమర్పించే భక్తుల కోరిన కోరికలు తీర్చే మన దేవతలు సమ్మక్క- సారలమ్మ ఆగమనానికి భక్తులందరూ, కుల మతాలకతీతంగా, రాజకీయ పార్టీలకతీతంగా, అధిక సంఖ్యలో తరలిరావాలని వీణవంక గ్రామస్తులు సాదర స్వాగతం పలుకుతున్నారు.