హైదరాబాద్ ప్రతినిధి తెలంగాణ ఎక్స్ ప్రెస్ డిసెంబర్10
ప్రముఖ సినీ నటుడు మోహనబాబు అకారణంగా జల్పల్లి లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని TJA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వి .రాజేందర్ నాథ్ తీవ్రంగా ఖండించారు.
మీడియా ప్రజలకు, ప్రభుత్వాలకు మీడియా వారధిగా పని చేస్తుంది.సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్దతతో విధులు నిర్వర్తిస్తారు. తమ కుటుంబ విషయాలపట్ల ఫ్రస్టేషన్ ఉన్న మోహనబాబు టీవీ 9, TV 5 జర్నలిస్తులపై దాడి చేయడం సరికాదు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని TJA డిమాండ్ చేస్తున్నది. అన్నారు మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నాం. అని తెలిపారు భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నారు
మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని TJA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి .రాజేందర్ నాథ్ తీవ్రంగా ఖండించారు
8