బిచ్కుంద మార్చి 14 తెలంగాణ ఎక్స్ ప్రెస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలలోని ఖత్ గావ్ గ్రామంలో కార్యకర్తల సమావేశం (విజయోత్సవ సభ)లో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు గారు..
గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..
కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు..
గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ పటేల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే వారిని శాలువాతో సన్మానించారు..
గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు..
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రతిఫలం ఉంటుందన్నారు..
తాను ఎమ్మెల్యే గా గెలిచిన రెండు నెలల్లోనే ఖత్ గావ్ గ్రామంలో సి.సి. రోడ్డు వేయించానని తెలిపారు..
అదేవిధంగా ఎస్సీ కాలనీకి కూడా త్వరలోనే రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు..
అభివృద్ది నోటి మాటలకు, పేపర్లకు పరిమితం కాకుండా మీ కళ్లకు కనిపించేవిధంగా చేస్తానని తెలిపారు..
హన్మంత్ షిండే అంత అసమర్థుడు, అవినీతి పరుడు దేశంలో ఎక్కడా ఉండడని..
చివరికి మరుగుదొడ్ల బిల్లులలో కూడా కమీషన్లు తీసుకున్న నీచమైన వ్యక్తి అని అన్నారు..
బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా పూర్తిగా కనుమరుగవుతుందని చెప్పారు..
ఆ పార్టీకి భవిష్యత్ లేదని అందుకే రెండు సార్లు ఎంపీగా పనిచేసిన బీ.బీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీలో చేరాడని అన్నారు..
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, పేదల బతుకులు మార్చేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు..
అందుకే కాంగ్రెస్ పార్టీని బలపర్చి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు..
