–91500/ నగదు,బంగారం దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు
–వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి చూసే సరికి తలుపులు పగలగొట్టి ఉన్న వైనం
–స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇంటి యజమాని
బోనకల్,ఫిబ్రవరి 10,(తెలంగాణ ఎక్స్ప్రెస్):
మండల పరిధిలోని సీతానగరం గ్రామంలో మత్కాల అప్పారావు తండ్రి వలరాజు అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం పట్టపగలే ఉదయం సుమారు 11 గంటల సమయంలో చోరీ జరిగింది. అప్పారావు భార్య పొదుపు సంఘం ద్వారా తీసుకున్న 21500,తమ మిర్చి అమ్మగా వచ్చిన 70000 వేల రూపాయలను తమ బీరువా లాకర్లో పెట్టుకొని వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం 9 గంటలకే చేనుకు వెళ్లడం జరిగింది. తిరిగి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తామ వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి తమ ఇంటి తలుపులు పగలగొట్టి బీరువా యెక్క లాఖరు పగలగొట్టి అందులో వారు దాచిపెట్టిన 91500 నగదుతోపాటు,రెండు బంగారు చెవి దిద్ధులు దింగిలించు కెళ్ళారని ఇంటి యజమాని అప్పారావు తెలిపారు. వెంటనే బాధితుడు బోనకల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో చోరీలు జరుగుతుండడంతో మండల వాసులు భయబ్రంతులకు గురవుతున్నారు.పోలీసు అధికారులు నిఘా పెంచాలని మండల ప్రజలు కోరుతున్నారు.