**ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా బండ రాళ్లు వేశారని వృద్ధుల ఆవేదన*
**పది నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు అయినా పట్టించుకోని అధికారులు*
*పలుమార్లు ప్రజావాణి లో ఫిర్యాదు*
తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ డిసెంబర్ 23
వెల్గటూరు మండలంలోని జగదేవపేట గ్రామానికి చెందిన వృద్ధులు వారి పట్టా భూమిలో ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. కాగా వారి కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాళ్లు అదే గ్రామంలో వేరే చోట ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు.
కాగా వృద్ధులు ఉండే ఇంటికి వెళ్లే ప్రభుత్వ దారిని అదే గ్రామానికి చెందిన ఒక కుటుంబం కబ్జా చేసి వృద్ధులకు రాకపోకలు లేకుండా బేసిమెంట్ బండ రాళ్లు దారికి అడ్డంగా వేశారు. ఈ విషయం గురించి వారి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ కార్యదర్శి,వెల్గటూర్ ఎమ్మార్వో, ఎంపిడివో, ఎంపివో లకు ఫిర్యాదు చేయగా వారు చర్యలు తీసుకుపోగా మా పరిధి కాదు అని తప్పించుకున్నారు.
వృద్ధులు చేసేది లేక జిల్లా కలెక్టర్ కు ప్రజవాణిలో జూన్ నెలలో లో ఫిర్యాదు చేయగా జులై నెలలో గ్రామ కార్యదర్శి ఇరువర్గాల వారికి నోటీసులు ఇచ్చారు.
కానీ దర్యాప్తు కోసం ఏ అధికారి మా గ్రామానికి వచ్చింది లేదు, ఇప్పటి వరకు మా సమస్య తీర్చింది లేదు. అందుకే మళ్ళీ మా అత్తామామలతో కలిసి ఫిర్యాదు చేయడానికి వచ్చామని ఇకనైనా మా సమస్య తీర్చి మా అత్తా మామల ఇంటికి వెళ్ళే దారి ఇప్పించగలరని కలెక్టర్ ను వేడుకున్నారు నూకల దీవెన.
