మధిర డిసెంబర్ 19 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మధిర పట్టణంలో 21 డివిజన్ rcm చర్చి వెనుక మధిర పట్టణ అభివృద్ధిలో భాగంగా ఎస్.డి.ఎఫ్ నిధులతో మంజూరైన కాలువ సైడ్ డ్రైన్ ,సీసీ రోడ్లపైన నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ .ఇసుక, కంకర ,సిమెంట్ సమనపాలల్లో కలపకుండా రోడ్లు, కాలువలు వేస్తున్న దుస్థితి రాజీవ్ నగర్ లో ఏర్పడింది .ఇవ్వాళా వేసిన రోడ్లు అప్పుడే పైకి ఇసుక తేలి కాంటాక్ట్ నిర్లక్షానికి దారితీస్తున్నాయి.అదే విధంగా పోసిన కాలువలకు కనీసం నీరుకూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని ,డివిజన్ ప్రజలు కాంట్రాక్టర్ పైన అసహన వ్వక్తం చేస్తున్నారు . అధికారులు చొరవ చూపి తక్షణమే కాంట్రాక్టర్ పైన తగు చర్యలు తీసుకోవాలని మనవి.