Home తాజా వార్తలు శ్రీ రామ నామ స్మరణతో మార్మోగిన ఎదులాబాద్ గ్రామం

శ్రీ రామ నామ స్మరణతో మార్మోగిన ఎదులాబాద్ గ్రామం

by Telangana Express

ఘట్కేసర్,జనవరి 23(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టాపనలో భాగంగా
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎదులాబాద్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.గ్రామంలోని అన్ని ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్ష ప్రసారం ద్వార గ్రామస్తులు వీక్షించారు. 500 ఏళ్ల కల నెరవేరిందని గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.ఈ మేరకు ఘట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ లు ఆలయనికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి.అనంతరం అన్న దాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.సాయంత్రం హనుమాన్ శోభా యాత్ర నిర్వహించారు.డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ యువత సంబరాలు చేసుకున్నారు. శోభా యాత్రలో ఘట్కేసర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పాల్గొన్నారు.ప్రధాన వీధుల గుండా యాత్ర సాగగా మహిళలు మంగళ హరతులతో నీళ్ల బిందెలతో ఎదురొచ్చిఘన స్వాగతం పలికారు గ్రామం మొత్తం సాయంత్ర దీపాలు వెలిగించి భక్తి పారవశంతో మునిగిపోయారు.


ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ధాతల సహారంతో గ్రామం మొత్తం కాషాయ మయం చేశారు.ఉత్సవాలకు సహకరించిన దాతలకు నిర్వాహకులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు .

You may also like

Leave a Comment