ఎల్లారెడ్డి, డిసెంబర్ 12,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎల్లారెడ్డి ఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి మన్నె ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. గురువారం మండలంలోని మాచాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారుల కోసం చేస్తున్న సర్వేను ఆర్డీఓ, తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, ఎంపీడీఓ అతినారాపు ప్రకాష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను లబ్ధి దారులకు అందించనుందని, ఇందు కోసం మండలంలోని 31 గ్రామ పంచాయతీల పరిదిలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సర్వేను పారదర్శకంగా , పకడ్బందీగా నిర్వహించి ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా నిర్దేశిత అప్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతరం బ్రహ్మణపల్లి, జంగమాయి పల్లి గ్రామాల్లో చేస్తున్న సర్వేను తహశీల్దార్, ఎంపీడీఓలు పరిశీలించారు. సర్వే వివరాలను మొబైల్ ద్వారా ఏవిధంగా నమోదు చేయాలి అనే విషయాన్ని, వారిచే నమోదు చేయించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.