బిచ్కుంద జనవరి-1:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బుధవారం నాడు ,ఎం ఎల్ ఎస్ పాయింట్ బిచ్కుంద సివిల్ సప్లై హమాలీల నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న కార్మికులకు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ అన్న వీరికిమద్దతుతెలుపుతూమాట్లాడుతూ.సివిల్ సప్లై కమిషనర్ గారితో చర్చలు.4 అక్టోబర్ 2004 జరిగిన చర్చలో భాగంగా క్వింటాలకు 26 రూపాయలు ఉన్నటువంటి హమాలీ రేటు 29 రూపాయలకు పెంచుతూ అంగీకరించడం జరిగింది. అలాగే రెండు జతల బట్టలు, కుట్టు కూలీతో సహా ఇస్తామన్నారు.ప్రతి సంవత్సరం దసరా బోనస్ తో పాటు స్వీటు రేట్లు పెంచుతామని పెండింగ్లో ఉన్న 10 నెలల కమిషన్ రేట్ ఇస్తామని.ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు. ఆరోగ్య హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి. రాష్ట్ర సివిల్ సప్లైకమిషనర్, పౌర సరఫరల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హమాలి సోదరులతో జరిగిన చర్చలు అంగీకరించడం జరిగింది.ఒప్పంద ప్రకారం జీవో ఇవ్వకపోవడం శోచనీయమని సురేష్అన్నఅన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సివిల్ సప్లై హమాలీలతో జరిగిన ఒప్పంద ప్రకారం జీవో విడుదల చేయాలని సురేష్ అన్న ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షుడు పండరి,కార్యదర్శి అశోక్ లతోపాటు బిచ్కుంద ఎం.ఎల్.ఎస్. పాయింట్ హమాలీ సోదరులు సంతోష్, రవీందర్, అంజయ్య, శివాజీ, నాందేవ్, సాయిలు, శ్రీనివాస్ హమాలీలు పాల్గొన్నారు.

