Home తాజా వార్తలు సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమే

సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమే

by Telangana Express

మంచిర్యాల, మార్చి 06, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు మోర్ పవర్ అంటే జర్నలిస్టులు మోర్ ఫ్రీడమ్ అంటారని తెలిపారు. ప్రజా సమస్యలు వెలికి తెచ్చి పరిష్కరింపజేయడం జర్నలిస్టులకే సాధ్యమని చెప్పారు. పరిపాలనలో అనుభవజ్ఞులు సూచనలు తీసుకుని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర తగ్గుతోందన్నారు. ఇది మనకు ప్రమాదకరమైన పరిణామమని చెప్పారు. జాతీయస్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీపై ప్రభావితం చేసే వారిని ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

You may also like

Leave a Comment