Home తాజా వార్తలు జిల్లా పట్టణంలోని హమాలివాడలో రహదారి విస్తరణ వివాదం పరిష్కారం

జిల్లా పట్టణంలోని హమాలివాడలో రహదారి విస్తరణ వివాదం పరిష్కారం

by Telangana Express

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర్

మంచిర్యాల, జనవరి 27, (తెలంగాఞ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా పట్టణంలోని మాలివాడలో రహదారి విస్తరణ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర్ రావు పరిష్కారం చేశారు. శనివారం మంచిర్యాల హమాలివాడ లో రహదారి విస్తరణ వివాదానికి ఎమ్మెల్యే తెరదించారు. గత కొద్దిరోజులుగా రోడ్ విస్తరణ విషయం లో పాక్షికంగా ఇండ్లు కోల్పోతున్న బాధితుల మధ్య వివాదం తలెత్తి విస్తరణకు ఆటంకంగా మారింది. వివాదం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా రోడ్డు విస్తరణ దగ్గరకు వచ్చి బాధితులతో చర్చించారు. ఇండ్లు కోల్పోయిన , కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వపరంగా సాధ్యమైనంత మేరకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. 55 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ చేస్తారని ఇండ్ల తొలగింపులో సొంత పార్టీ పరాయి వాళ్ళు అనే వివక్షత చూపనని స్పష్టం చేశారు. ఇప్పటికే 60 ఫీట్ల రోడ్ 55 ఫీట్లకు కుదించారని ఇంకా తగ్గించడం సాధ్యం కాదని తెలిపారు. రహదారి విస్తరణలో నష్టం జరుగుతున్నప్పటికి అభివృద్ధి కోసం త్యాగం చేయకతప్పదన్నారు. రోడ్ విస్తరణ పనులు నిలిపివేయడానికి కోర్టుకు వెళ్లిన ప్రయోజనం ఉండదని సూచించారు. గత పాలకుల వివక్షత వల్ల రోడ్ విస్తరణ ఆగిపోవడంతో పాటు వివాదాస్పదంగా మారిందని ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, ఇంజనీర్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment